Expired Milk Packets Distribution At Anganwadi Centres : కాలం చెల్లిన పాలు, మురిగిపోయి దుర్వాసన వస్తున్న గుడ్లు పంపిణీ చేస్తున్నారని అంగన్వాడి కేంద్రానికి గ్రామస్థులు తాళాలు వేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలం రామకృష్ణాపురం గ్రామంలో గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లలకు కాలం చెల్లిపోయి రెండు నెలలు దాటిన పాలను పంపిణీ చేయడంతో గ్రామస్తులు అంగనవాడి ఉపాధ్యాయురాలితో వివాదానికి దిగారు. ఈ విషయంపై అడగటానికి వెళ్లిన గ్రామస్థులపై అంగన్వాడి ఉపాధ్యాయురాలు దొరుసుగా సమాధానం చెప్పడంతో అంగన్వాడి కేంద్రానికి గ్రామస్తులు తాళాలు వేశారు.