Whiskey IceCream Rocket Arrest : ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలే ఉండరు. దీన్నే అవకాశంగా మార్చుకున్న జూబ్లీహిల్స్‌లోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ యజమానులు వాటిలో మద్యం కలిపి విక్రయాలు సాగిస్తున్నారు. ఇవి తిని మత్తుకు బానిసయ్యే చిన్నారులు, మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తారనే అత్యాశతో వక్రమార్గం పట్టారు. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ అమ్మకాలకు పాల్పడుతుండటంతో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు పార్లర్ యజమానుల్ని అరెస్ట్ చేశారు.