Police Arrested Eight For Selling Adulterated Ginger Garlic Paste : ఈ మధ్యకాలంలో ఇన్స్టంట్ ఫుడ్‌పై ప్రజలు విపరీతంగా ఆధార పడుతున్నారు. ఉద్యోగాల్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. ఇన్స్టంట్ పిండిల నుంచి ప్రతీదీ చిటికెలో అయిపోవాలి అని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు వాడుతుంది మంచిదా? లేదా అన్న విషయం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు బయట కొంటారు. దాన్ని తయారు చేయడం సమయంతో కూడిన పని కావడంతో బయట కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి చిన్న విషయాలనే ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు 'నకిలీ'గాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. తాజాగా టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఏకంగా 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను పట్టుకున్నారు.