Kushalam Honey Farming business in Eluru District : ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు చేసినా సంతృప్తి లేదు. బతుకుదెరువు కోసం అయినోళ్లకు, సొంతూరికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. స్వయం ఉపాధితోపాటు నలుగురికీ ఉపయోగపడే పని చేయాలని సంకల్పించారు ఆ ముగ్గురు. విభిన్న వ్యాపారం దిశగా అడుగులేశారు. ఎపికల్చర్లో శిక్షణ తీసుకుని తేనె వ్యాపారం ప్రారంభించారు. సవాళ్లను అధిగమించి ఇప్పుడు ఏకంగా ఏడాదికి 70 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు.