Lanka Villages Farmers Suffered Badly Due to Heavy Rains : కోనసీమ జిల్లాలో కురిసిన ఎడతెరపిలేని వర్షాలు లంక గ్రామల రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. వృద్ధ గౌతమి, గోదావరి నది పాయలు ప్రమాద స్థాయిలో ప్రవహించి జిల్లాలో వేలాది ఎకరాల్లోని లంక భూములను ముంచెత్తింది. వరద ప్రభావంతో మెట్ట పంటలు పూర్తిగా నీటి పాలయ్యాయి. మునగ, బెండ, వంగ, మిరప, ఆనప, బీరకాయ తోటలు పది రోజులుగా వరద నీటిలోనే మునిగి ఉండిపోవడంతో కుళ్లిపోయాయి. పశువులకు గ్రాసం కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.