Farmers Facing Problems due to Lack Of Water in Cherlopalli Reservoir : వైఎస్సార్సీపీ నేతల రాజకీయ స్వార్థం వేల మంది రైతులకు శాపంగా మారింది. ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన జలాశయం వారి స్వార్థం కారణంగా అడుగంటి పోయింది . ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెర్లోపల్లి జలాశయంలోని చివరి నీటిబొట్టు వరకు ఖాళీ చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరలించుకుపోవడంతో కదిరి నియోజకవర్గ రైతులు ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు.