Water Conservation In Kondapur Hyderabad : హైదరాబాద్లో వేసవి ప్రారంభానికి ముందే నీటి కోసం కటకటలాడే ప్రాంతాల్లో అదొకటి. అక్కడి నివాసితులు నీళ్ల కోసం నానా కష్టాలు పడ్డారు. వాటర్ ట్యాంకర్లు తెప్పించున్నా రోజువారీ అవసరాలకు సరిపోయేవి కావు. ఈ జల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాలనీల వాసులంతా ఏకమయ్యారు. ఉద్యమంగా కదిలి ప్రతీ ఇంటికి తప్పనిసరిగా ఇంకుడుగుంత నిబంధనను పక్కాగా అమలుచేశారు. మరో అడుగు ముందుకేసి రూప్ టాప్ ప్రాజెక్టు, పదుల సంఖ్యలో ఇంజక్షన్ బోర్వెల్స్ తవ్వించారు. పడ్డ ప్రతీ వర్షపు బొట్టును ఒడిసిపట్టి నీటి సమస్యను దూరం చేసుకున్నారు.