Hot Water Gushes Out Of Borewell In Bhadradri : అదో మారుమూల గిరిజన ప్రాంతం. పదుల సంఖ్యలో గిరిజన, ఆదివాసీ కుటుంబాలు నివసించే కుగ్రామం. రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్రామంలో ఎక్కడైనా బోరు బావు తవ్వితే వేడి నీరు ఉబికి వస్తున్నాయి. దేశంలోనే వేడి నీరు ఉద్భవించే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. మరి అంతటి విశిష్టత ఉన్న ఆ గ్రామం విశేషాలు, వేడి నీటి ఊట బావుల ప్రత్యేకత తెలుసుకుందాం.