Winter Kashmir Utsav Mela In Hyderabad : భాగ్యనగరవాసులకు కాశ్మీర్ అందాలను పరిచయంచేస్తూ సాగర తీరంలో ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ్ మేళా విశేషంగా ఆకట్టుకుంటోంది. కశ్మీర్ మంచుకొండల్లోని అద్భుత సన్నివేశాలు కళ్లకుకట్టేలా సెట్టింగులు ఏర్పాటుచేశారు. హైదరాబాద్లో గత 21 ఏళ్లుగాప్రత్యేక అనుభూతులను పరిచయం చేస్తూ వింటర్ ఉత్సవ్ మేళాను నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మైదానంలో ఈ ఏడాది కశ్మీర్ అందాలను భాగ్యనగర వాసులకి పరిచయం చేసే ఉద్దేశ్యంతో వింటర్ ఉత్సవ్ మేళ ఏర్పాటు చేశారు.