Cheetah At Miyapur Metro Station In Hyderabad : మీరు మియాపూర్లో ఉంటున్నారా అయితే మీ కోసమే ఈ న్యూస్. మీరు ఉంటున్న ఏరియాలో చిరుతపులి కనిపించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక వద్ద ఇవాళ కొందరు చిరుతపులిని చూశారు. స్టేషన్ వెనక జరుగుతున్న నిర్మాణాల కోసం వచ్చిన కూలీలు చిరుతను చూశారని సమాచారం. చిరుత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను వీడియో తీసి సమాచారాన్ని పోలీసులకు అందించారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులను సంప్రదించారు. ఇరువురు కలిసి చిరుతపులిని గాలించే పనిలో ఉన్నారు. మరోవైపు మియాపూర్ మెట్రో వెనక ఉన్న చంద్రనాయక్ తండావాసులను అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.