Ganesh Immersion In Hyderabad : భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూసే వినాయక నిమజ్జన వేడుకకు రంగం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న లంబోదరుడి విగ్రహాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే గంగ ఒడికి బయల్దేరనున్నాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసే విగ్రహాలను సహజ నీటి వనరుల్లో నిమజ్జనం చేసి నీటిని కలుషితం చేయొద్దని హైకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు.