Ganja Smuggling in AP : గంజాయి సరఫరా ముఠాలు కొత్త దారిని ఎంచుకున్నాయి. ఎవ్వరికీ అనుమానం రాకుండా సిగరెట్లలో గంజాయిని దట్టించి, బడ్డీకొట్లలో పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నారు. అలాగే కోడ్ భాషను వాటిని సరఫరా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో తరచూ జరుగుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్, రోడ్లపైనే గొడవలు పెట్టుకోవడం షరా మామూలైంది. గంజాయి ముఠాలు సరకు ఎంత కావాలంటే అంత ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేస్తున్నాయి. కనిగిరి, దర్శి, పామూరు, పొదిలి, కొండపి, టంగుటూరు తదితర ప్రాంతాల్లో బడ్డీకొట్లునే కేంద్రాలుగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఫలితంగా ఎంతో మంది యువత దీని బారిన పడుతున్నారు.