Ganja Lady Don Arrested in Odisha : పలు గంజాయి కేసుల్లో నిందితురాలిగా ఉండి తప్పించుకుని తిరుగుతున్న లేడీ డాన్ సంగీత సాహును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం ఖుర్దా జిల్లా కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీత సాహు నాలుగు సంవత్సరాల నుంచి గంజాయి దందాలో దిగింది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండటంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో పరిచయాలు చేసుకుంది. తర్వాత గంజాయి సరఫరా చేయడం మొదలు పెట్టిందని పోలీసులు తెలిపారు. గతంలో ధూల్‌పేట్‌లో 29కిలోలు, 11.3 కిలోల రెండు కేసుల్లో పట్టుబడిన నిందితులకు గంజాయిని సరఫరా చేస్తూ గతంలో పట్టుబడింది.