GOLD WORTH RS 2 CRORE SEIZED: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి పులివెందులకు ఫార్చునర్ వాహనంలో తరలిస్తున్న రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సేల్స్ టాక్స్ అధికారులు సీజ్ చేశారు. అర్ధరాత్రి హైదరాబాదు నుంచి బిల్లులు లేకుండా బంగారం తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు కాపు కాసి బంగారాన్ని పట్టుకున్నారు.