Instagram Reels Deaths : ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు ఒక్క రాత్రిలోనే స్టార్ అయిపోవచ్చు. ఫాలోవర్లు అధికంగా ఉంటే ప్రమోషన్లతో డబ్బు సంపాదించవచ్చని, చాలా మంది వివిధ రకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. కానీ అదే రీల్స్ పిచ్చి ఇప్పుడు పరాకాష్టకు చేరింది. కేవలం యువత మాత్రమే కాదు, పెళ్లైన మహిళలు సైతం రీల్స్ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. అందులో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు కుటుంబ బాంధవ్యాలకు దూరం అవుతున్నారు.