Gold Thieves Arrested in Jammalamadugu: బ్యాంకుల్లో బంగారు నగలు తాకట్టు పెట్టేందుకు వెళ్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జమ్మలమడుగు పోలీసులు అరెస్టు చేశారు. విచారించగా. తల్లీ, కుమారుడు, కోడలిపై రాష్ట్రవ్యాప్తంగా 12 కేసులు ఉన్నట్లు తేలడంతో విస్మయానికి గురయ్యారు.