Blast in Granite Quarry Three Died at Srikakulam : శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దీనబంధుపురం గ్రానైట్ క్వారీలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. గ్రానైడ్ బండలు వెలికితీయడానికి పెట్టిన బాంబులు ప్రమాదవశాత్తు పేలడంతో టెక్కలికి చెందిన ముల్లంగి రామారావు, బడబందల అప్పన్నతోపాటు తమిళనాడుకు చెందిన ఆర్ముగం మృతి చెందారు. బంధువులు అక్కడికి చేరి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో కృష్ణమూర్తి పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో గ్రానైట్ క్వారీలను మూసివేయించారు.