A Person Cheated Goldshop Owner in Tadepalligudem: అతను బంగారం షాపులో గుమాస్తా. కొద్దిరోజులుగా నమ్మకంగానే ఉన్నాడు. యజమానులు అప్పగించిన పనిని చెప్పినట్టే చేసేవాడు. దీంతో వారికి అతనిపై నమ్మకం కుదిరింది. కానీ అదును కోసం ఎదురుచూస్తున్న అతను సమయం దొరక్కగానే తన పని కానిచ్చేశాడు. తన మీదికి నేరం రావొద్దని కట్టుకథ అల్లాడు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టైల్లో విచారిస్తే నిజాలన్నీ బయటపడ్డాయి. సినిమా తరహాలో జరిగిన ఈ రాబరీ తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.