Guntakallu Railway DCM Inspection in Anantapur Railway Station : అమృత్ భారత్ పథకంలో (Amrit Bharat Station Scheme) భాగంగా రెండు దశల్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. డివిజన్లోని అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో జరుగుతున్న నిర్మాణ పనులను డీసీఎం శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ కోసం రెండు దశల్లో రూ. 446 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. అనంతపురం రైల్వేస్టేషన్లో ఆరు చోట్ల ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.