General Coaches Issues in Trains : రైలు ప్రయాణమంటేనే ఏ వయసు వారికైనా అదొక ప్రత్యేక అనుభూతి. కానీ రైల్వే శాఖ నిర్ణయాలతో రానురానూ ఆ అభిప్రాయం దూరమవుతోంది. రైళ్లలో సింహభాగం పేద, మధ్య తరగతి వారే ప్రయాణిస్తుంటారు. వారికి సురక్షిత ప్రయాణాన్ని అందించాల్సిన ఆ శాఖ జనరల్ బోగీలను కుదించడంతో సామాన్య ప్రయాణికులు తంటాలు పడుతున్నారు. కరోనా తర్వాత నుంచి కేంద్రం విధానాల కారణంగా రైల్వే వ్యవస్థ సామాన్యుడికి దూరమవుతూ వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.