Railway Minister Somanna in AP : రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న కొనియాడారు. అనంతపురం రైల్వే స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. అమృత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ పథకం కింద అభివృధి పనులు జరుగుతున్నాయన్నారు.