కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 125 ఆటిజం సెంటర్లను ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆటిజం సెంటర్లు , విద్యార్థుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆటిజంతో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలని దానిపై శాసనసభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.