People Traveling on Railway Bridge : రైలు పట్టాలపై రైళ్ల రాకపోకలు చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాలు రోడ్లపై ఉంటాయి. వాటిపై నుంచి అందరూ వెళ్లడం మామూలే అనిపిస్తుంది. కానీ మంచిర్యాల జిల్లా ఊరుమందమర్రిలో మాత్రం రైలు మార్గం మీదుగా ప్రజలు రాకపోకలు చూస్తుంటే భయం వేస్తుంది. అది కూడా వాగుపై ఉన్న రైల్వే ట్రాక్‌పై వారి రాకపోకలు చేస్తున్నారంటే కళ్లు పెద్దవి చేసి చూడాల్సిందే. అంత ప్రమాదకరంగా ఉంది అక్కడ పరిస్థితి. పెద్దవాగుపై వంతెన నిర్మించకపోవడంతో మరో దిక్కులేక ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్న దుస్థితి నెలకొంది. రెండు మండలాల ప్రజలు పడుతున్న ఇక్కట్లపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం