Construction Bridge In Hanumakonda : హనుమకొండ నయీనంగర్ నాలా విస్తరణ పనులు పూర్తికావడంతో వాహన రాకపోకలు మొదలయ్యాయి. హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే ప్రధానమార్గం ఇదే కావడంతో నిత్యం ఈ మార్గం రద్దీగా ఉంటుంది. అలాగే వాణిజ్య సముదాయాలు పాఠశాలలలు, హోటళ్లు కూడా ఈ మార్గంలో ఎక్కువే. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ రహదారి వంతెన నిర్మాణ పనులు కారణంగా ఇన్నాళ్లూ బోసిపోయినా మళ్లీ కళ సంతరించుకుంది. నయీంనగర్ నాలాపై వంతెన నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్లో శంకుస్ధాపన జరిగింది. వర్షాల్లోనూ పనులు జోరుగా జరిగాయి. దీంతో ఐదునెలల్లోనే నాలా విస్తరించి వంతెన నిర్మాణం పూర్తిచేశారు.