రాష్ట్రంలో చాలా రైల్వేస్టేషన్లు ఇప్పటికీ అపరిశుభ్రంగానే ఉన్నాయి. సరైన వసతుల్లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని... ముఖ్యమైన రైల్వేస్టేషన్ల రూపురేఖలు మార్చేలా NAD ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన స్టేషన్లను ఏకంగా విమానాశ్రయాల తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి కళ్లు చెదిరేలా నిర్మాణాలు చేపడుతోంది. వీలైనంత త్వరలోఅందుబాటులోకి తెచ్చేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి