Cherlapally Terminal Railway : చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్టేషన్కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మాణం చేపట్టగా చర్లపల్లి టర్మినల్ అందమైన ముఖద్వారంతో ఆకట్టుకుంటుంది. ఎత్తైన ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం చేపట్టడంతో స్టేషన్కు దిగువన ప్లాట్ ఫాంలకు నిర్మాణం చేపట్టారు.