Skip to playerSkip to main contentSkip to footer
  • 11/30/2017
Two youth escaped from Charges in Hyderabad Metro Rail traveling.

మెట్రో రైలు తొలి రోజే 2లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తొలి రోజు కావడంతో ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపారు. మెట్రో అధికారులు కూడా ప్రయాణికుల అంచనాకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేశారు.అంతేగాక, ఎంతో అత్యాధునిక, కట్టుదిట్టమైన పరిజ్ఞానంతో మెట్రో వ్యవస్థను అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా మెట్రో వ్యవస్థలోని ఓ లోపం బయటపడింది. దాని ఆసరాగా చేసుకుని ఇద్దరు యువకులు ఛార్జీల పడకుండా ప్రయాణం చేయడం గమనార్హం.ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇద్దరు యువకులు బుధవారం మెట్రోలో అమీర్‌పేట నుంచి మియాపూర్‌కు బయలు దేరారు. స్మార్ట్‌ కార్డు కొనుగోలు చేసి ఎలక్ట్రానిక్‌ గేటు వద్ద స్వైప్‌ చేసి మెట్రో ఎక్కి.. మియాపూర్‌ వెళ్లారు. అక్కడ ప్లాట్‌ఫాం మీద కాసేపు గడిపి తిరిగి మెట్రోలో అమీర్‌పేట చేరుకున్నారు. మెషిన్‌ వద్దకు వచ్చి స్మార్ట్‌ కార్డు స్వైప్‌ చేయగానే పది రూపాయల జరిమానా పడినట్టు చూపించింది.

Category

🗞
News

Recommended