Government Build New Asphalt And Cement Roads in Nellore District : వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లు రాష్ట్రంలో రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. కొత్త రోడ్ల సంగతి అటుంచితే గుంతల రోడ్లలో తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదు. పూర్తిగా ధ్వంసమైన రోడ్లతో వాహనదారులు నిత్యం నరకం అనుభవించారు. కూటమి ప్రభుత్వం రాకతో నెల్లూరు జిల్లాలో రోడ్లకు మోక్షం లభించింది. గ్రామాలు, పట్టణాల్లో కొత్త సిమెంట్ రోడ్లు నిర్మించడంతో వాహన చోదకులు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. సవారీ సాఫీగా సాగుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.