Roads Damaged in Nandyal District : పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారైంది కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి పరిస్థితి. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు అడుగుకో గుంతతో వాహనాలకు ఆహ్వానం పలుకుతోంది. అధ్వానంగా తయారైన రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. నరకదారిలో నిత్యం వాహనాలు మరమ్మతులకు గురై ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.