Road Accidents Raised In Andhra Pradesh in YSRCP Regime : గంటకు ఇద్దరు రోజుకు 58 మంది, నెలకు 1700. ఏడాదికి సగటున 20 వేలు పైనే ఈ గణాంకాలు రాష్ట్రంలో పెరిగిన జనాభా సంఖ్య అనుకుంటే పొరపాటే. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారులపై ప్రమాదాల కారణంగా రోడ్డున పడిన వారి సంఖ్య ఇది. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. గజానికో గుంత, అడుగుకో గొయ్యితో అదుపు తప్పిన వాహనాలకు లెక్కే లేదు. అతి వేగాన్ని అదుపు చేయలేక, సూచికల బోర్డులు లేక, చిన్నపాటి మరమ్మతులకు నోచుకోక, రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ పరిస్థితులను మార్చే సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించే ప్రయత్నాలు ప్రారంభించింది.