4Government Focus on Roads Repair in Vijayawad : రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లలో గాలికి వదిలేసిన రోడ్లను బాగుచేయడంపై దృష్టి సారించింది. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లతో పాటు నగరాల్లోని అంతర్గత రోడ్లకూ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. విజయవాడలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.