Development of Perecherla-Kondamodu Road : పల్నాడుకు రాజమార్గంగా ఉన్న పేరేచర్ల- కొండమోడు రహదారి అభివృద్ధికి మార్గం సుగమమైంది. నాలుగు వరుసలుగా విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేయడం భూసేకరణ కొలిక్కి రావడంతో ఈ నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో నిధులతో పాటు సాంకేతిక అడ్డంకులు సైతం తొలగిపోయాయి.