Roads in AP Tribal Areas : బడికి వెళ్లాలంటే కాలి నడక తప్పదు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీ మోతలే శరణ్యం. నిన్నమొన్నటి వరకు అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల దయనీయ పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజన గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. అడవి తల్లి బాట పేరిట రూ.1000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి వెయ్యి కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మిస్తున్నారు. అడవి బిడ్డల్ని ఓటర్లుగా కాక మనుషులుగా గుర్తించి వారి అవసరాలు తీర్చేలా సర్కార్ చర్యలు చేపడుతోంది.