Rammohan Naidu On New Airports in AP: ఎయిర్ క్రాష్ ప్రమాదాలపై కేంద్ర విమానాయ శాఖలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్లో రాష్ట్రంలో సీ ప్లేన్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందన్నారు. అక్టోబరులో సీ ప్లేన్ డెమో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ డెమోను నిర్వహిస్తామని రామ్మోహన్ స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అవ్వటంతో దిల్లీతో పాటు జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ పెరుగుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.