SpiceJet Flight Delayed At Shamshabad Airport : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం బయలుదేరడం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మూడు గంటలు ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. మూడు గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా విమానం ఆలస్యం అయిన ఘటనపై ఎయిర్పోర్ట్ వర్గాలు స్పందించాయి. సాంకేతిక లోపం వల్లే ఆలస్యం జరిగిందని స్పైస్‌జెట్ సిబ్బంది తెలిపారు. కాగా విమానం ఆలస్యం గురించి తమకు స్పైస్ జెట్ సిబ్బంది ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆరోపించారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.