Lift Stuck Half An Hour In Secunderabad Gandhi Hospital : సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో గురువారం మధ్యాహ్నం సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అందులో ఉన్నటువంటి సహాయకులు, ఓ రోగి అరగంట పాటు ఏం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట తర్వాత టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేయడంతో లిఫ్ట్‌లో చిక్కుకున్న 15 మంది సురక్షితంగా బయటకు వచ్చారు.