KIMS Hospital in Hyderabad : చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ, మన మీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు.
పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం ఆధ్వర్యంలో డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. యి.