Falcon Company Investment Fraud : హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ మోసం బయటపడింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట భారీగాలాభాలు ఇప్పిస్తామని ఓ సంస్థ 850 కోట్ల మేర పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది. దేశవ్యాప్తంగా 1700 కోట్లు సేకరించి అకస్మాత్తుగా బోర్డు తిప్పేయడంతో 6 వేల 9 వందల 79 మంది దగా పడ్డారు. కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.