Bank Manager Fraud in Palnadu District : పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ నిర్వాకానికి ఖాతాదారులు నిండా మునిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఖాతాల్లో లేదని తెలిసి హతాశులయ్యారు. రెండు శాఖల్లో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరగడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌గా 2017 ఏప్రిల్‌లో నరేశ్ చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టాడు. అతడు ఇంటింటికీ వెళ్లి ఖాతాదారులతో మమేకమయ్యాడు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని కోరాడు. రూపాయికిపైగా వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు.