పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ICICI బ్యాంక్ శాఖల్లో జరిగిన అక్రమాలపైCID విచారణ సాగుతోంది. CID అడినషల్ ఎస్పీ ఆదినారాయణ, CID సీఐ సంజీవ్ కుమార్ ఆధ్వర్వంలో అధికారులు.... ఉదయం 11 గంటల నుంచి చిలకలూరిపేట బ్యాంక్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లు దారి మళ్లించడంలో... అప్పటి మేనేజర్ నరేష్ తో పాటు సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నారు. బ్యాంకు తలపులు మూసి... ఎవరూ లోపలికి రాకుండా....బయటకు వెళ్లకుండా సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు బాధిత ఖాతాదారులకు న్యాయం చేయాలంటూ AISF నేతలు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. మోసానికి పాల్పడిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.