Capital Land Investments in Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్లో మూడో రోజు పర్యటిస్తోంది. అందులో భాగంగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహా రాష్ట్ర బృందం సమావేశమైంది.