Former CID ASP Vijay Pal Transfer to Guntur : మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో అరెస్టైన సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను ఒంగోలు ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరుకు తరలించారు. కాసేపట్లో గుంటూరులో మేజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరు పరచనున్నారు. కాసేపటి క్రితమే ఒంగోలు తాలుకా పీఎస్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. విజయ్‌పాల్ రాత్రి నుంచి ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్లో ఉన్నారు.