VIJAY PAUL REMAND REPORT: రఘురామ కృష్ణంరాజుని గతంలో సీఐడీ కస్టడీలో అంతమొందించేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న రఘురామ గుండెపై కూర్చుని బాదారని రిపోర్టులో తెలిపారు. రబ్బరు బెల్టులతో కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారని వివరించారు. ఈ కేసు వెనకున్న పెద్దలు బయటకు రావాలంటే విజయ్పాల్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, పిటిషన్ వేయాలని గుంటూరు కోర్టు ఆదేశించింది.