HC on CM Chandrababu Cases To CBI Petition: గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను సమీక్షించకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా నిలువరించగలమని హైకోర్టు ప్రశ్నించింది. అప్పటి కేసులు రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసినవో? కాదో? తేల్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని, ఆ హక్కును ఎలా హరించగలమని నిలదీసింది. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ హయాంలో నమోదైన కేసుల్ని సీబీఐకి అప్పగించాలంటూ వ్యాజ్యం వేసిన పిటిషనర్‌పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. తదుపరి విచారణను సెప్టెంబర్11కు వాయిదా వేసింది.