Fire Accident in Visakha SBI Office : విశాఖ రెడ్నం గార్డెన్స్‌లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్న సిబ్బంది నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు.