Mssive Fire Accident in Shivarampalli: హైదరాబాద్ నగర శివారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్స్ దుకాణంలో దురదృష్టవశాత్తు భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.