Fire Accident at Old City : హైదరాబాద్ పాతబస్తీలోని అబ్బాస్ టవర్స్‌లోని వస్త్రాలు విక్రయించే నాలుగు అంతస్తుల కాంప్లెక్స్‌లో తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని వస్త్రాలు నిల్వ ఉంచిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నాలుగో, మూడో అంతస్తులకు మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు అంచన వేశారు. మూడో అంతస్తులో ఉన్న వస్త్ర దుకాణాల్లో కూడా మంటలు చెలరేగాయి. మూడు, నాలుగో అంతస్తులో మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్న దుకాణాల్లోని నిల్వ చేసిన వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికంగా నివాసంచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.