Fire Accident At Mallapur Industrial Estate : హైదరాబాద్ మల్లాపూర్‌లోని పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.