AP MLAS DRAMA AND COMEDY SKITS: ఏపీ శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు విజయవాడలో ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు MLAలు సాంస్కృతిక, హస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పగలబడి నవ్వారు. ఎమ్మెల్యేల స్కిట్లకు, డైలాగ్‌లకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.