Liquor Shop Allocation in AP : లిక్కర్ పాలసీలో భాగంగా రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించారు. ఈ మేరకు ఆబ్కారీ శాఖ జిల్లాలవారీగా 335 లిక్కర్ షాప్స్ను కేటాయించిన విషయం తెలసిందే. వీటికోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా ఈరోజు ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ చేయనున్నారు. లాటరీలో గెలుపొందిన లైసెన్స్ దారుడికి దుకాణం నిర్వహించుకునేందుకు రెండేళ్ల కాలపరిమితి ఉంది.